మంచిర్యాల కలెక్టర్, ఎమ్మెల్యేపై హైకోర్టు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి, నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొమ్మెన హరీష్ గౌడ్ ఈనెల 6న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రజాధనం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి, నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొమ్మెన హరీష్ గౌడ్ ఈనెల 6న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రజాధనం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి నియోజకవర్గానికి మంజూరైన రూ.90 లక్షల డీఎంఎఫ్‌టీ నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ హోళికేరి, మరో 5గురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.