హైకోర్టులో విజయసాయిరెడ్డికి చుక్కెదురు..

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్‌ వేశారు. మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించిన హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనను […]

Update: 2021-08-10 04:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్‌ వేశారు. మొదట సీబీఐ లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించిన హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది

Tags:    

Similar News