మన్యంలో నిఘా.. పంద్రాగస్టుకి హై అలర్ట్

దిశ, భద్రాచలం : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవి బూటకపు స్వాతంత్ర్యదిన వేడుకలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అబయ్ విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. నిజమైన స్వాతంత్ర్యం కోసం‌ నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కావాలని అబయ్ పిలుపునిచ్చారు. ఫాసిస్టు సర్కార్‌కి వ్యతిరేకంగా ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే మోడీ కుట్రే ఒక సంవత్సరంపాటు […]

Update: 2021-08-14 08:23 GMT

దిశ, భద్రాచలం : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవి బూటకపు స్వాతంత్ర్యదిన వేడుకలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అబయ్ విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. నిజమైన స్వాతంత్ర్యం కోసం‌ నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కావాలని అబయ్ పిలుపునిచ్చారు.

ఫాసిస్టు సర్కార్‌కి వ్యతిరేకంగా ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే మోడీ కుట్రే ఒక సంవత్సరంపాటు జరిగే ఆజాదీకి అమృత్ మహోత్సవం అని అబయ్ లేఖలో పేర్కొన్నారు. ఆదివారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రైవేటు సంస్థలు, ప్రజాసంఘాలు ఏర్పాట్లు చేశారు.‌ జెండా వందన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి సంఘటనలకు చోటులేకుండా మన్యం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్ళలో రహదారులపై కాపుగాచి వాహన తనిఖీలు నిర్వహించారు. ఆధార్ కార్డులు చెక్‌‌ చేసి అనుమానిత వ్యక్తులను ఆరా తీశారు. మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో మరోవైపు పోలీసు నిఘా వర్గాలు రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై డేగకన్ను వేసి ఉంచారు.

Tags:    

Similar News