మన్నెంలో హై అలర్ట్..!
దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మన్నెంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్డు పార్టీ 16వ వార్షికోత్సవ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ తేగడ గ్రామంలో మావోయిస్టులు కరపత్రాలు వేసిన మరుసటి రోజు భద్రాచలం ప్రధాన రహదారి ప్రక్కన మూడు చోట్ల మందు పాత్రలను పోలీసులు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన […]
దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మన్నెంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్డు పార్టీ 16వ వార్షికోత్సవ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ తేగడ గ్రామంలో మావోయిస్టులు కరపత్రాలు వేసిన మరుసటి రోజు భద్రాచలం ప్రధాన రహదారి ప్రక్కన మూడు చోట్ల మందు పాత్రలను పోలీసులు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే..
ఈ ఘటన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో కూంబింగ్, ప్రభావిత గ్రామాల్లో పోలీసు బలగాలు గస్తీ నిర్వహిస్తున్నారు. గతంలో అటవీ ప్రాంత గ్రామాలకు పరిమితమైన మావోయిస్టుల కదలికలు.. ఇప్పుడు ప్రధాన రహదారులు, మండల కేంద్రంలోనూ వెలుగు చూడడంతో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల నడుమ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు.