దేశంలో జికా వైరస్ కలకలం.. 13 మందిలో లక్షణాలు.. టెన్షన్‌లో వైద్యులు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకోకముందే తాజాగా దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూడటం ఆందోళను గురిచేస్తోంది. కేరళలో జికా వైరస్ లక్షణాలున్న కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో 24 ఏళ్ల గర్భిణీ గత నెలలో జ్వరం, తలనొప్పి, దద్దుర్లు సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. ఆమెకు జరిపిన వైద్య […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకోకముందే తాజాగా దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూడటం ఆందోళను గురిచేస్తోంది. కేరళలో జికా వైరస్ లక్షణాలున్న కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో 24 ఏళ్ల గర్భిణీ గత నెలలో జ్వరం, తలనొప్పి, దద్దుర్లు సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది.
ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో తొలుత జికా వైరస్ తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సంకేతాన్ని చూపించాయి. ఆ తరువాత పరీక్షించిన 19 నమూనాల్లోని 13 కేసుల్లో జికా పాజిటివ్ లక్షణాలు కనిపించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కేరళలో 13 మంది జికా వైరస్ బారినపడ్డారు. అయితే, వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మందిలో జికా వైరస్ లక్షణాలు పూర్తిగా రాకపోయినప్పటికీ, వారిలో కొందరికి జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, అనారోగ్యం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారా వ్యాపించే.. జికా వైరస్ లక్షణాలు చికున్‌గున్యా లక్షణాల తరహాలోనే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ లక్షణాలు సాధారణంగా 2–7 రోజులు పాటు ఉంటాయి. దోమ కాటు ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా సంక్రమిస్తుంది. జికా వైరస్ లక్షణాలు సాధారణంగా 2–7 రోజులు పాటు ఉంటాయి. జికా వైరస్ వెలుగులోకి వచ్చిన కారణంగా కేరళ ఆరోగ్య శాఖ, తిరువనంతపురం జిల్లా ఉన్నతాధికారులు జికా వైరస్ కేసులను తీవ్రంగా పరిగణిస్తూ.. వైరస్ కట్టడికి తగిన చర్యలను తీసుకుంటున్నారు. వైరస్ కారణంగా అన్ని జిల్లాలను అప్రమత్తం చేసినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాకు తెలిపారు.