సమంతకు దక్కిన అరుదైన గౌరవం.. తొలి దక్షిణాది వుమెన్‌గా సరికొత్త రికార్డు..!
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల తన భర్త చైతూతో విడాకులు తీసుకున్న సమంత మానసికంగా తనను స్ట్రాంగ్ చేసుకునేందుకు, ప్రశాంతత కోసం అధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తో్ంది. అయితే, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌లో సమంత నటించిన గాను ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. నవంబర్ 20వ తేది నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మాట్లాడేందుకు నటి సమంతకు ఆహ్వానం అందింది. ఐఎఫ్ఎఫ్ఐలో స్పీకర్‌గా ఆహ్వానించబడిన మొదటి దక్షిణ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల తన భర్త చైతూతో విడాకులు తీసుకున్న సమంత మానసికంగా తనను స్ట్రాంగ్ చేసుకునేందుకు, ప్రశాంతత కోసం అధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తో్ంది. అయితే, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌లో సమంత నటించిన గాను ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. నవంబర్ 20వ తేది నుంచి 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మాట్లాడేందుకు నటి సమంతకు ఆహ్వానం అందింది.
ఐఎఫ్ఎఫ్ఐలో స్పీకర్‌గా ఆహ్వానించబడిన మొదటి దక్షిణ భారత నటిగా సమంత సరికొత్త క్రియేట్ చేసింది. IFFI నిర్వాహకులు.. దర్శకురాలు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్ మరియు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా వక్తలుగా ఉన్నారు. స్పీకర్స్ లిస్టులో మనోజ్ బాజ్‌పేయి కూడా ఒకరు. కాగా, సమంత త్వరలోనే బాలీవుడ్లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.