'మా'లో మరో ట్విస్ట్.. ఆయన గెలిస్తే అన్నీ బయటపెడతా.. పూనమ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రచారాలలో హోరాహోరీగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ హీట్ పెంచుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠగా మారిన ఈ మా ఎన్నికల […]

Update: 2021-10-01 22:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రచారాలలో హోరాహోరీగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ హీట్ పెంచుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోజుకో ట్విస్ట్ తో ఉత్కంఠగా మారిన ఈ మా ఎన్నికల లోకి నటి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా తాను మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ కి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది.

‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు పూనమ్‌ కౌర్‌ ట్విట్టర్లో తెలిపారు. ఆయన గెలిస్తే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ తో దిగిన ఫొటో పోస్ట్ చేసి ఓ ట్వీట్‌ పెట్టారు. ” ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయి. పూనమ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Tags:    

Similar News