అమ్మాయి, అబ్బాయి కలవడమే ప్రేమ కాదు : మేఘ ఆకాష్
దిశ, సినిమా : అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘా ఆకాష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘డియర్ మేఘ’. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ భావోద్వేగ ప్రేమ కథా చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల లీడ్ రోల్స్‌లో నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మూవీ […]
దిశ, సినిమా : అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘా ఆకాష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘డియర్ మేఘ’. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ భావోద్వేగ ప్రేమ కథా చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల లీడ్ రోల్స్‌లో నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మూవీ విశేషాలను మీడియాతో పంచుకుంది. ‘ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించేందుకు ముందుగా భయపడ్డప్పటికీ.. ప్రస్తుతం ఉన్న పొజిషన్‌లో రిస్క్ చేయక తప్పలేదు. ‘డియర్ మేఘ’ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను’ అని తెలిపింది.
ఈ సినిమాలో ‘అన్‌కండిషనల్ లవ్’ అంటే ఎలా ఉంటుందో చూస్తారన్న మేఘ.. అబ్బాయి, అమ్మాయి కలవడమే ప్రేమ కాదని, ఎన్నో రకాల ప్రేమలుంటాయని చెప్పింది. కాగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జెన్యూన్ లవ్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారని వివరించింది. ప్రస్తుతం తను ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తుండగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని పేర్కొంది.