ఖమ్మంలో మెరిసిన ‘ఉప్పెన’ హీరోయిన్.. భారీగా ఎగబడిన జనం
దిశ, ఖమ్మం కల్చరల్ : ఆధునిక జీవన శైలిలో భాగంగా సంప్రదాయ పద్ధతులను దృష్టిలో ఉంచుకుని అన్ని వయస్సుల వారి అభిరుచులకు అనుగుణంగా వస్త్ర ప్రపంచాన్ని ఒకే చోటా, తక్కువ ధరల్లో అందిస్తోన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఖమ్మంలో తన 25వ షోరూమ్‌ను ప్రారంభించింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీవీసీ గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్, […]
దిశ, ఖమ్మం కల్చరల్ : ఆధునిక జీవన శైలిలో భాగంగా సంప్రదాయ పద్ధతులను దృష్టిలో ఉంచుకుని అన్ని వయస్సుల వారి అభిరుచులకు అనుగుణంగా వస్త్ర ప్రపంచాన్ని ఒకే చోటా, తక్కువ ధరల్లో అందిస్తోన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఖమ్మంలో తన 25వ షోరూమ్‌ను ప్రారంభించింది.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీవీసీ గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అలాగే సినీ నటి కృతి శెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తైన తర్వాత కృతిశెట్టి మాట్లాడుతూ.. అన్ని వయస్సు వారి అభిరుచులను ప్రతిబింబించడంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఒకవైపు నాణ్యతకు, మరో వైపు తక్కువ ధరలకు పెద్దపీట వేస్తూ సంప్రదాయ, అధునాతన జీవన పద్ధతుల వారి అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ఇది ఖమ్మం జిల్లాకు విచ్చేయడం గొప్ప విషయం అన్నారు. 25వ షోరూంను ఖమ్మం నగరంలో తాను ప్రారంభించడం ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు.
కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినయ్, రాజేశ్, కేశవ్ మీడియా బ్రాండ్ గురించి మీడియా ప్రతినిధులకు వివరిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ, బెంగళూరులోనూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెంబర్ 1 స్థాయికి చేరుకున్న వైనాన్ని వివరించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో తమ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విస్తరించనున్నదని, అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. విస్తృత శ్రేణికి చెందిన అత్యంత నాణ్యమైన ఫ్యాషన్ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం వల్లే శరవేగంతో తమ పథకాలు విజయవంతమౌతున్నాయని డైరెక్టర్లు తెలిపారు. కాగా, హీరోయిన్ కృతిశెట్టిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.