1200 కిలో మీటర్ల ప్రయాణానికి ఏడాది సమయం

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదార్లపై వందల సంఖ్యలో టైర్లు ఉండే భారీ వాహనాలు తరుచూ దర్శనమిస్తుంటాయి. ఖరీదైన భారీ యంత్ర సామగ్రిని వీటిలో రవాణా చేస్తుంటారు. ఈ భారీ వాహనాలు చాలా నిదానంగా పయనిస్తాయి. పై ఫొటోలోని వాహనం వాటికి జేజెమ్మ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే, మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి ఏడాది పట్టింది మరి ఆ వాహనానికి! గతేడాది జూలై 8న మహారాష్ట్రలోని నాసిక్‌లో బయల్దేరిన ఈ భారీ ట్రక్కు ఆదివారం కేరళలోని గమ్యస్థానం […]

Update: 2020-07-20 11:45 GMT

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదార్లపై వందల సంఖ్యలో టైర్లు ఉండే భారీ వాహనాలు తరుచూ దర్శనమిస్తుంటాయి. ఖరీదైన భారీ యంత్ర సామగ్రిని వీటిలో రవాణా చేస్తుంటారు. ఈ భారీ వాహనాలు చాలా నిదానంగా పయనిస్తాయి. పై ఫొటోలోని వాహనం వాటికి జేజెమ్మ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే, మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి ఏడాది పట్టింది మరి ఆ వాహనానికి! గతేడాది జూలై 8న మహారాష్ట్రలోని నాసిక్‌లో బయల్దేరిన ఈ భారీ ట్రక్కు ఆదివారం కేరళలోని గమ్యస్థానం చేరుకుంది.

తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పరిశోధనలకు అవసరమైన అత్యాధునిక యంత్ర సామగ్రిని ఈ వాహనం మోసుకొచ్చింది. రాకెట్ తయారీకి అవసరమైన తక్కువ బరువుండే పదార్ధాన్ని రూపొందించే ఏరోస్పేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ ను ఈ భారీ వాహనంపై తరలించారు. ఆ యంత్ర సామగ్రి బరువు 70 టన్నులు కాగా, అంత బరువును మోస్తూ ఈ ట్రక్కు రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున నాలుగు రాష్ట్రాల గుండా పయనించి ఎట్టకేలకు తిరువనంతపురంలో ప్రవేశించింది. కాగా, ఈ ట్రక్కుపై 32 మంది సిబ్బంది కూడా ఉన్నారట.

Tags:    

Similar News