నిప్పుల కొలిమిలా.. నిర్మల్!
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించింది. కడెం మండలంలో 46.5 డిగ్రీలు , సోన్, మామడ మండలాల్లో 46.4 డిగ్రీలు, పొన్కల్‌లో 46.1, లక్ష్మణ చందలో 45.9, ఖానాపూర్ మండలంలో 45.6, తానూర్‌లో 45.5, సారంగపూర్‌లో 45.4, కుబీర్‌లో 45.4 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించింది. కడెం మండలంలో 46.5 డిగ్రీలు , సోన్, మామడ మండలాల్లో 46.4 డిగ్రీలు, పొన్కల్‌లో 46.1, లక్ష్మణ చందలో 45.9, ఖానాపూర్ మండలంలో 45.6, తానూర్‌లో 45.5, సారంగపూర్‌లో 45.4, కుబీర్‌లో 45.4 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిర్మల్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.