భద్రాద్రిలో జోరువాన
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులుత తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇక పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం […]
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులుత తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇక పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.