ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయనిస్తున్నట్లు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని తెలిపింది. ఇది రేపటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయనిస్తున్నట్లు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని తెలిపింది. ఇది రేపటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.