ఆదివాసీల జిల్లాలో మళ్లీ భారీ వర్షం.. ప్రజలకు తప్పని తిప్పలు
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులకు సమీపంలో ఉన్న పంటపొలాల్లో వరదనీరు ప్రవహించడంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు దస్నాపూర్, బంగారుగూడ వాగులు ఉధృత రూపం దాల్చాయి. ఈ ప్రభావంతో సమీప గ్రామాల్లోని […]
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులకు సమీపంలో ఉన్న పంటపొలాల్లో వరదనీరు ప్రవహించడంతో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
మరోవైపు దస్నాపూర్, బంగారుగూడ వాగులు ఉధృత రూపం దాల్చాయి. ఈ ప్రభావంతో సమీప గ్రామాల్లోని ఇండ్లు నీటమునిగాయి. గ్రామస్తులు పిల్లాపాపలతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులు వరదల కారణంగా ఇండ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు పలు ప్రాజెక్టులకు ఎగువనుంచి వరద తాకిడి కొనసాగుతూనే ఉంది. దీంతో గేట్లు వదిలి నీటిని దిగువకు వదిలే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.