హై అలర్ట్.. జీహెచ్ఎంసీలో మళ్లీ భారీ వర్షాలు..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 22 నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడా అతి భారీ వర్షాలు కురయనున్నట్టుగా ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్, కుమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురియనున్నట్టు తెలిపారు. వీటితో పాటు జీహెచ్ఎంసీలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 22 నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడా అతి భారీ వర్షాలు కురయనున్నట్టుగా ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్, కుమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురియనున్నట్టు తెలిపారు.
వీటితో పాటు జీహెచ్ఎంసీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో, వరద ప్రభావం చూపే ప్రాంతాల్లో జాగ్రత్తలు చేపట్టాలని హెచ్చరించారు. వదర నీటికి ఎలాంటి ప్రమాధాలు జరుగుకుండా నిత్యం పర్యవేక్షణలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 5.7మిమీ ఉండగా 3మిమీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 49.9మిమీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమరం భీం ఆసీఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఆసీఫ్ నగర్‌లో 6.6మిమీ వర్షాపాతం నమోదైంది.