శేరిలింగంపల్లిలో భారీ వర్షం.. కాలనీలు జలమయం

దిశ, శేరిలింగంపల్లి : అకాల వర్షంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్కడికక్కడ నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన దీప్తి శ్రీ నగర్ నాలా నిర్మాణ పనులను వేగవంతం […]

Update: 2021-05-16 07:24 GMT

దిశ, శేరిలింగంపల్లి : అకాల వర్షంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఎక్కడికక్కడ నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన దీప్తి శ్రీ నగర్ నాలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏదైనా అత్యవసరం అయితే మమ్మల్ని గానీ, సంబంధిత అధికారులను గానీ సంప్రదించగలరని గాంధీ పేర్కొన్నారు.

 

Tags:    

Similar News