Jani Master: జానీ మాస్టర్ కు భారీ ఊరట.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

జానీ మాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శుక్రవారం బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేసింది.

Update: 2024-11-23 04:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా అరెస్టై.. బెయిల్ పై బయటికొచ్చిన విషయం తెలిసిందే. అతని బెయిన్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హై కోర్టు (Telangana High Court) అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. శుక్రవారం బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు కారణంగా ఆయనకు నేషనల్ అవార్డు కూడా రద్దయింది. 

Tags:    

Similar News