ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయి. ఆదివారం సాయంత్రం రెండు జిల్లాల్లో భారీగా వర్షాలు పడగా సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండలా మారింది. తాలిపేరు ప్రాజెక్టుకు చత్తీస్‌గడ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి వరద […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయి. ఆదివారం సాయంత్రం రెండు జిల్లాల్లో భారీగా వర్షాలు పడగా సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
తాలిపేరు ప్రాజెక్టుకు చత్తీస్‌గడ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో 18గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్ సైతం నిండు కుండలా మారింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు ప్రకటించారు.