పాలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. దీంతో గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు ఎడమ కాలువ ద్వారా రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో శుక్ర‌వారం నాటికే పాలేర్ రిజర్వాయర్ నిండుకుండ‌ను తలపించింది. శ‌నివారం ఉద‌యం రిజర్వాయర్‌కు ఉన్న ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోవ‌డంతో నీరు దిగువకు ఉరకలేస్తోంది. కాగా, గత నాలుగేళ్ల కాలంలో రిజ‌ర్వాయ‌ర్ పూర్తిస్థాయిలో […]

Update: 2020-08-15 06:56 GMT

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. దీంతో గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు ఎడమ కాలువ ద్వారా రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో శుక్ర‌వారం నాటికే పాలేర్ రిజర్వాయర్ నిండుకుండ‌ను తలపించింది. శ‌నివారం ఉద‌యం రిజర్వాయర్‌కు ఉన్న ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోవ‌డంతో నీరు దిగువకు ఉరకలేస్తోంది. కాగా, గత నాలుగేళ్ల కాలంలో రిజ‌ర్వాయ‌ర్ పూర్తిస్థాయిలో నిండిన దాఖ‌లాలు లేవు.

Tags:    

Similar News