Indiramma Housing Scheme: కండిషన్లు ఏమీ లేవు! ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల మోడల్‌ను ప్రతి మండలంలో కడుతున్నామని, ఇండ్ల నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: (Indiramma Housing Scheme) ఇందిరమ్మ ఇండ్ల మోడల్‌ను ప్రతి మండలంలో కడుతున్నామని, ఇండ్ల నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కల్లూరు సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవారి చిరకాల కోరిక సొంత ఇల్లు అని, ఆ కోర్కెను తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. మొదటి విడతగా నాలుగు లక్షల యాబై వేల ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు విడతల్లో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే నాలుగు ఏళ్లల్లో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజాపాలనలో 1 కోటి ఐదు లక్షల అప్లికేషన్
ప్రజాపాలన కార్యక్రమంలో 1 కోటి ఐదు లక్షల అప్లికేషన్ వస్తే ఇళ్ల కోసం ఎనభై లక్షల మంది ఇళ్లు అడిగారని స్పష్టం చేశారు. 17,734 మందిని యాప్ ద్వారా ఇప్పటి వరకు సర్వే చేయడం జరిగిందన్నారు. సర్వే పూర్తి అయిన వెంటనే అర్హులైన వారికి ఇళ్ళు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. తనకు పాలేరు ఎలాగో సత్తుపల్లి కూడా అలాగేనని, పాలేరులో ఇచ్చినట్లే సత్తుపల్లి లో కూడా ఇస్తాని చెప్పారు. నాటి సీఎం ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బొమ్మ చూపిచ్చి ఇళ్లు ఇస్తా అనేవాడని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 63 వేల ఇళ్ళు మాత్రమే ఇచ్చారని తెలిపారు. సత్తుపల్లిలో 537 ఇళ్లు ఇస్తే అవి పూర్తి కాలేదన్నారు. అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేసి వాటిని కూడా పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు.
ధరణి వచ్చిన దగ్గర నుంచి అభద్రత ఉందన్నారు. తెలంగాణా భూభారతి చట్టం ద్వారా భరోసా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. భూభారతి పూర్తిగా అమలు లోకి రావడానికి ఇంకా రెండు నెలలు పడుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామల 9 లక్షల 24 వేల అప్లికేషన్లు సేకరించి చట్టంలో ఎక్కడ పొందు పర్చలేదన్నారు. లాండ్ ట్రిబ్యునల్‌లో సమస్య పరిష్కారం చేసే విధంగా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందన్నారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండం ఎందుకవుతది
(KCR)కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో కూర్చుంటాడని, కేసీఆర్ సూచనలు ఇవ్వడానికి (Telangana Assembly) అసెంబ్లీకి వస్తాడనుకుంటే ఆయన తొత్తులు అసెంబ్లీలో పుస్తకాలు విసిరేశారని మండిపడ్డారు. కొత్త చట్టం వస్తే వాళ్ళ బాగోతం బయట పడుతుందని అసెంబ్లీలో గందరగోళం చేశారని ఫైర్ అయ్యారు. (KTR) కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా ఎందుకు మారుతుందో అర్ధం కావడం లేదని ప్రశ్నించారు.(Congress) కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని, గతంలో బుద్ధి చెప్పారు.. మళ్లీ బుద్ధి చెపుతారని అన్నారు.