మా బలాన్ని తుపాకీ శక్తులు అడ్డుకోలేవు.. అనిత మండారి
మా బలాన్ని తుపాకులు అడ్డుకోలేవని... మా చావులతో మీ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారని అబుజ్ మద్ డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి అనిత మండారి నేరుగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ని ప్రశ్నిస్తూ ఒక లేఖను విడుదల చేశారు.
దిశ, భద్రాచలం : మా బలాన్ని తుపాకులు అడ్డుకోలేవని... మా చావులతో మీ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారని అబుజ్ మద్ డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి అనిత మండారి నేరుగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ని ప్రశ్నిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. పోలీసుల కాల్పుల్లో పిల్లలకు గాయాలు అయితే.. మావోయిస్టుల కాల్పులు వలెనే చిన్నారులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసులు దుష్ప్రచారం చేయడాన్ని ఆమె ఖండించారు. మమ్మల్ని నిర్మూలించడానికి వేలాది మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా కమెండోలు పోలీస్ శిబిరాలు, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్ లు అవసరమా అని ప్రశ్నించారు. తమ బలం తుపాకీల శక్తి, హత్యలు సంఖ్యపై ఆధారపడి లేదు, తుపాకీల బలంతో మావోయిజాన్ని అంతమొందించడం సాధ్యం కాదని తెలిపారు.