కిన్నెరసాని వాగు ఉగ్రరూపం
దిశ, కొత్తగూడెం: జిల్లా ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలకు వరద పోటెత్తింది. దీంతో ఆళ్లపల్లి మండలంలోని మైలారం- రాయిగూడెనికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆదివాసులు వరద ఉద్ధృతిలోనే వాగులు దాటుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే భయం గుప్పెట్లో బతుకుతున్నామని, వైద్య సేవలు కూడా అందడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.