లారీలో రూ. 2 కోట్ల గంజాయి.. పోలీసులు ఏం చేశారంటే..!
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసుపై ఎస్పీ సునీల్‌దత్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాచలం పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో.. ఎస్ఐ మధుప్రసాద్ సిబ్బందితో కలిసి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇదే సమయంలో అటువైపుగా వచ్చిన లారీలో సోదాలు చేయగా..ఏకంగా 1,005 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒడిశాకు చెందిన వసీం అనే […]
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసుపై ఎస్పీ సునీల్‌దత్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాచలం పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో.. ఎస్ఐ మధుప్రసాద్ సిబ్బందితో కలిసి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇదే సమయంలో అటువైపుగా వచ్చిన లారీలో సోదాలు చేయగా..ఏకంగా 1,005 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒడిశాకు చెందిన వసీం అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇదే గంజాయిని మధ్యప్రదేశ్‌లోని ఈశ్వర్ సింగ్, ప్రేమ్ సింగ్ అనే గంజాయి వ్యాపారులకు చేరవేస్తున్నట్టు ఒప్పుకున్నారని ఎస్పీ సునీల్‌దత్ వివరించారు.