అధ్యాపకుడిపై విద్యార్థిని ఫిర్యాదు
తనను అధ్యాపకుడు వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, మేడ్చల్ టౌన్ : తనను అధ్యాపకుడు వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో ఉన్న బైబిల్ కళాశాలలో ఒక విద్యార్థిని చదువుతూ అక్కడే ఉన్న వసతి గృహంలో నివాసం ఉంటుంది. అనాథ అయిన తనను కళాశాల అధ్యాపకుడు వినయకుమార్ మానసికంగా, శారీకంగా వేధిస్తున్నాడని కళాశాల డైరెక్టర్ బోజిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సదరు విద్యార్థిని తెలిపింది.
ఈ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆ విద్యార్థిని వసతి గృహం నుంచి ఇష్టానుసారంగా బయటికి వెళ్లి ఓ యువకుడితో తిరుగుతుండటాన్ని గుర్తించి మండలించడంతో అధ్యాపకుడిపై విద్యార్ధిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని కళాశాల యాజమాన్యం చెపుతుంది. దీంతో తాము కళాశాల నుంచి తొలగించామని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తిరిగి కళాశాలకు చేరుకొని తరగతులను జరగకుండా ఆందోళన చేసిందని, దీంతో కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థినితో పాటు మరో యువకుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.