Cyber Crime: డిజిటల్ అరెస్ట్‌ అంటూ మోసం.. వృద్ధుడికి రూ.1.4 కోట్లకు కుచ్చుటోపీ

దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.

Update: 2024-12-04 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం‌లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్‌ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.

తాజాగా, అనకాపల్లి జిల్లా (Anakapally District) నర్సీపట్నం ప్రాంతానికి చెందని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు సైలెంట్‌గా నొక్కేశారు. వివరాల్లోకి వెళితే.. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ స్కాం జరిగిందని.. ఈ మేరకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆ వృద్ధుడిని భయపెట్టారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే తమకు డబ్బు చెల్లించాలని నమ్మించారు. దీంతో అది నమ్మిన బాధితుడు బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను పూర్తిగా విత్‌డ్రా చేసి నేరగాళ్లకు పంపించాడు. మొత్తం మూడు రోజుల వ్యవధిలో రూ.1.4 కోట్లను సైబర్ నేరగాళ్ల ఖాతకు పంపాడు. అయితే, మరో రెండు రోజులు గడిచాక తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

Tags:    

Similar News