ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఒకరు మృతి, బాలుడి పరిస్థితి విషమం
One dead In Pushpa Release at Sandhya Theater, RTC Cross Road
అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ ఎమ్ థియేటర్ లో ఫ్యాన్స్ కలిసి సినిమా చూశారు. అప్పటికే ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడి తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా మరో బాలుడు పరిస్థితి విషమంగా మారింది. బాలుడికి సీపీఆర్ చేశారు. అనంతరం కిమ్స్ హస్పిట ల్ కు తరలించారు. బాలుడిని వెంటిలెటర్ చికిత్స అందిస్తున్నారు. అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.