త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో టాలీవుడ్ హీరో

ప్రజెంట్ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు అవుతున్నాయి. యంగ్ స్టార్స్ పెళ్లిళ్లు చేసుకుని బ్యాచులర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

Update: 2024-12-04 16:21 GMT

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు అవుతున్నాయి. యంగ్ స్టార్స్ పెళ్లిళ్లు చేసుకుని బ్యాచులర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో మ్యారేజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) అల్లుడు శ్రీను మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ‘భైరవం’(Bhairavam) చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హై వోల్డెజ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘భైరవం’పై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి శ్రీనివాస్ తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకుల పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇక గణేశ్ పెళ్లికి కాస్త సమయం ఉంది. శ్రీనివాస్‌ది పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని అమ్మాయిని శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు’ అని చెప్పుకొచ్చాడు సురేష్. ప్రజెంట్ సురేశ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. సాయి శ్రీనివాస్ అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News