Chaitanya-Shobhita: వైభవంగా నాగచైతన్య-శోభిత పెళ్లి వేడుక.. ఆశీర్వదించిన మెగాస్టార్
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల(Naga Chaitanya, Sobhita Dhulipala) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల(Naga Chaitanya, Sobhita Dhulipala) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అక్కనేని(Akkineni), దగ్గుబాటి, శోభిత ఫ్యామీలీలు హాజరయ్యాయి. అట్టహాసంగా జరిగిన ఈ మ్యారేజీకి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి(T.Subbarami Reddy), విక్టరీ వెంకటేష్, అల్లు అర్వింద్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.