వ్యక్తిపై గొడ్డలితో దాడి..
గొడ్డలితో ఓ యువకుడు మరో వ్యక్తి పై దాడికి దిగిన సంఘటన చోటు
దిశ,శంకరపట్నం : గొడ్డలితో ఓ యువకుడు మరో వ్యక్తి పై దాడికి దిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... శంకరపట్నం మండలంలోని మెట్టు పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అంతడుపుల గణేష్ అనే వ్యక్తి పై దాడికి దిగినట్లు సమాచారం. ఆయుధంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 కి సమాచారం అందించడంతో హుటాహుటిన క్షతగాత్రున్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.