ఆర్టీసీ బస్సు ఢీకొని సైక్లిస్ట్ మృతి

చేగుంట మండల కేంద్రం నుండి స్వగ్రామమైన వల్లూరు కు సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వల్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-12-03 15:17 GMT

దిశ చేగుంట : చేగుంట మండల కేంద్రం నుండి స్వగ్రామమైన వల్లూరు కు సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వల్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నార్సింగ్ మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన వడ్ల రమేష్ (40) మండల కేంద్రమైన చేగుంటలో పనులు ముగించుకొని తన సైకిల్ పై స్వగ్రామమైన వల్లూరుకు వెళ్తుండగా నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ రాజధాని డీలక్స్ బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడి మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య లత, కుమారుడు వంశీ ఉన్నారు . నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


Similar News