మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు పరమేష్ రిమాండ్

ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగిన మహిళ కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు

Update: 2024-12-03 16:29 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగిన మహిళ కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. సీఐ బొల్లం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిగా ఉన్న కొంగర పరమేష్ ఇద్దరు అక్కలు హైమావతి, నాగమణి. అయితే హైమవతి కి 2009లో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో తుర్కయంజాల్ లో నివసిస్తోంది. వీరి తల్లిదండ్రులు సుమారు 10 సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. అప్పటి నుండి పరమేష్, నాగమణి రాయపోల్ గ్రామంలో వారి మామ వద్ద ఉంటున్నారు. కాగా 2014లో నాగమణి వివాహం జరిగింది. ఆ సమయాన ఒక ఎకరం భూమిని నాగమణికి బహుమతిగా ఇచ్చారు. అనంతరం ఆమె భర్తతో వివాహ వివాదాల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత నాగమణి తన గ్రామానికి తిరిగి వచ్చి తన సోదరుడితో కలిసి తన మామతో నివసిస్తున్నారు.

ఆపై హయతనగర్ లోని హాస్టల్ ఉంటుంది. ఆ తరువాత 2020లో నాగమణి పోలీస్ కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యి కుషాయిగూడ, హయతనగర్ పిఎస్ లలో పనిచేసింది. ఆ తర్వాత ఆమె విడాకులు దాఖలు చేసి 2022లో విడాకులు పొందడం జరిగింది. ఆమె రాయపోల్లో ఉన్న సమయంలో నాగమణి తన స్వగ్రామానికి చెందిన గ్రామస్థుడు బండారి శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తన తమ్ముడు పరమేష్, కుటుంబ సభ్యులు ఆమెను హెచ్చరించి, తమకు ఇష్టం లేని వివాహం చేయమని తేల్చిచెప్పాడు. కానీ నాగమణి వారి మాట వినలేదు. ఆమె మొదటి వివాహం సమయంలో ఆమెకు ఇచ్చిన ఒక ఎకరం భూమిని పరమేష్ కు తిరిగి ఇచ్చింది. ఆ తర్వాత బండారి శ్రీకాంత్ డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తితో కులాంతర వివాహం నవంబర్ 10 యాదగిరి గుట్ట ఆలయంలో ఆమె తమ్ముడు పరమేష్ ఇష్టానికి వ్యతిరేకంగా, వివాహం శ్రీకాంత్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అనంతరం నాగమణి తన ఒక ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలని పరమేష్ ను డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీంతో కోపాన్ని మరింత పెంచుకున్న పరమేష్, అతని స్నేహితులు, బంధువులు తమను నవ్వుల పాలు చేస్తారనే భావనతో వాళ్ళు గ్రామంలో జీవించడం జీర్ణించుకోలేనని తన అక్క కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తిలో వాట అడగడంతో అంతమొందించడానికి పథకం వేశాడు, ఒక వేట కోడవలి కొని తన కారులో ఉంచుకున్నాడు. ఆమె రాయపోల్ ఎప్పుడు వస్తుందా అని అవకాశం కోసం వేచి ఉన్నాడు. డిసెంబర్ 1వ తేదిన ఆదివారం నాగమణి తన భర్త శ్రీకాంత్ తో కలిసి రాయపోల్ గ్రామానికి వచ్చారు. ఆమె వచ్చిందని తెలుసుకున్న తన తమ్ముడు విసుగు చెంది తన ముందస్తు పథకం ప్రకారం ఆమెను చంపాలని నిర్ణంయించుకున్నాడు.

ఈ విషయంలో అతను తన స్నేహితుడు ఎ2 అచ్చన శివను సంప్రదించి తన అక్క కదలికలను తెలుసుకోవడానికి అతనికి సహాయం తీసుకున్నాడు. అయితే నాగమణి సోమవారం ఉదయం 8.30 గంటలకు తన స్కూటీపై రాయపోల్ నుండి మాన్యగూడ రోడ్డు మీదుగా విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న విషయాన్ని నిందితుడు పరమేష్ ఫోన్ చేసి ఎ2 సమాచారం ఇచ్చాడు. అయితే ఆమెను వెంబడించిన నిందితుడు రాయపోల్ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో మాన్యగూడ గ్రామం వైపు ఎవ్వరు లేని సమయంలో ఆమె వెళుతున్న స్కూటీని, కారుతో బలంగా ఢీకొట్టాడు. దీంతో కిందపడిన ఆమెను తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మెడపై దాడి చేసి హతమార్చాడు. కాగా మంగళవారం సీఐ సత్యనారాయణ, సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించిన్లు తెలిపారు.


Similar News