అతిగా చికెన్ తింటున్నారా? అయితే వెంటనే ఆపండి!
‘మీరు చికెన్‌ను అతిగా తింటున్నారా? అయితే వెంటనే ఆపండి. లేదంటే ప్రమాదమే’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. చికెన్ఎక్కువగా తిన్నోళ్లలో యాంటీమైక్రోబయల్రెస్టిస్టెన్స్(ఏఎంఆర్) అనే వ్యాధికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సూచించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీరు చికెన్‌ను అతిగా తింటున్నారా? అయితే వెంటనే ఆపండి. లేదంటే ప్రమాదమే’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. చికెన్ఎక్కువగా తిన్నోళ్లలో యాంటీమైక్రోబయల్రెస్టిస్టెన్స్(ఏఎంఆర్) అనే వ్యాధికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సూచించింది. పౌల్ట్రీ నుంచి వస్తున్న చికెన్‌ను అతిగా తినడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్లు ప్రత్యేక రిపోర్టును విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్య ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో చెప్పడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.
వాస్తవానికి చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది చికెన్‌ను తినేందుకు ఆసక్తి చూపుతారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా భుజిస్తారు. కరోనా సమయంలోనూ చికెన్వినియోగం ఎక్కువగా ఉన్నది. ఇప్పటికీ డైలీ చికెన్తినేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అతి ఎక్కువగా చికెన్తినడం వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో తన రిపోర్టులో పేర్కొన్నది. ముఖ్యంగా ఫామ్‌నుంచి ఉత్పత్తి చేసిన కోళ్ల నుంచి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం ఫామ్చికెన్లలో ఇదే సమస్య ఉన్నదని నొక్కిచెప్పింది. ఇలాంటి చికెన్ తిన్నోళ్లలో రెసిస్టెంట్ ప్రభావం తగ్గి వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తున్నట్లు వివరించింది.
చికెన్ స్టోర్ చేయడం కోసం..
కోళ్ల పౌల్ట్రీల్లో ప్రస్తుత కోళ్లు వృద్ధి చెందేందుకు, చికెన్‌ను ఆరోగ్యంగా, ఉంచడానికి అవసరానికి మించి యాంటీబయాటిక్స్‌ను ఇస్తున్నారు. దీంతో పాటు కోళ్లు వ్యాధుల బారిన పడకుండా ఇచ్చే మందులతోనూ ఆ కోళ్ల శరీరం కెమికల్మయం అవుతుంది. సదరు కోళ్ల శరీరంలో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ పేరుకుపోతుంది. ఇలాంటి చికెన్ తిన్న వాళ్ల శరీరంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పెరగడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. అలాంటి స్థితిలో శరీరం ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌కు చికిత్స కష్టమైందని డాక్టర్లు వివరిస్తున్నారు. దీంతో మాంసాన్ని సరిగ్గా ఉడికించడం, కోళ్ల వ్యర్ధాలు ఆహారంలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో పాటు పాల్ట్రీలలో అవసరానికి మించి కెమికల్స్వాడకాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరిస్తున్నారు. ఇక ప్రాసెసింగ్ చికెన్ ను తినడం కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
Read more: మాంసం ప్రియులకు భారీ షాక్.. అమాంతం పెరిగిన చికెన్ ధరలు