ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే రక్త ప్రసరణ తగ్గినట్లే

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరు అనారోగ్యం భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారం జీవన విధానం సరిగా లేకపోవడం వలన త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా మానవ

Update: 2023-08-09 02:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరు అనారోగ్యం భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారం జీవన విధానం సరిగా లేకపోవడం వలన త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా మానవ శరీరానికి రక్తప్రసరణ కీలకం. శరీరం అంతటా ఆక్సిజన్ పోషకాలని ఇది సరఫరా చేస్తుంది శరీర జీవ క్రియలు రక్తప్రసరణ కీలకపాత్ర పోషిస్తుంది అది కనుక సక్రమంగా జరగకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అందువలన మన శరీరంలో సరిగ్గా రక్త ప్రసరణ జరగడం లేదని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. తరచుగా పాదాలలో వాపు

2. రక్త ప్రవాహం సరిగ్గా లేనప్పుడు కండరాల పనితీరుకి అవసరమైన పోషకాలు అందనప్పుడు అలసటగా ఉంటుంది.

3.రక్తప్రసరణ సరిగా లేకపోతే చేతులు పాదాలు ఇతర అవయవాల్లో తిమ్మిరి జలదరింపు ఉంటాయి.

4.రక్తప్రసరణ సరిగా లేకపోతే చర్మం రంగు మారడం వంటివి కలుగుతాయి. అలాగే చేతులు, కాళ్లు చల్లగా ఉంటాయి.

Read More:    అమ్మాయిల షర్ట్ బటన్స్ ఎడమ వైపు, అబ్బాయిల షర్ట్ బటన్స్ కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా? 


Similar News