హై బీపీకి అదిరే చిట్కా.. ఈ నీళ్లు తాగితే ఇట్టే తగ్గిపోతుంది
మునగాకులు ఆరోగ్యానికి దివ్యౌషధం.

దిశ, ఫీచర్స్ : మునగాకులు ఆరోగ్యానికి దివ్యౌషధం. హైబీపీ ఉన్నవారు మునగాకుల నీరు తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఇందులో ప్రొటీన్ నుంచి అధిక ఫైబర్ వరకు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ నీటిని తాగితే.. మీ రక్తపోటు 2 గంటల్లో పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ రక్తపోటు 130-140కి తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు రెండు గ్లాసుల నీరు తాగాలి. మీరు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని తరుచుగా తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినకూడదు. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని కూరగాయలు లేదా చట్నీ రూపంలో తీసుకోవచ్చు. కానీ దాని నీటిని ఎక్కువగా తీసుకోకూడదు. లేకుంటే అది బీపీని మరింత తగ్గిస్తుంది. దీని ఆకులతో చట్నీ తయారు చేసుకుని పరోటా, అన్నంతో కూడా కలిపి తినవచ్చు. ఇది మన శరీరానికి సహజమైన క్లెనర్స్ గా పనిచేస్తుంది. అంతేకాదు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.