కూల్ కూల్ కిల్లర్స్.. కార్బోనేటెడ్ డ్రింక్స్ తో డేంజర్

సమ్మర్ సీజన్ కదా.. టీవీ ఆన్ చేస్తే 15 నిమిషాలకో కూల్ డ్రింక్ యాడ్ వస్తోంది.

Update: 2025-03-28 04:42 GMT
కూల్ కూల్ కిల్లర్స్.. కార్బోనేటెడ్ డ్రింక్స్ తో డేంజర్
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: సమ్మర్ సీజన్ కదా.. టీవీ ఆన్ చేస్తే 15 నిమిషాలకో కూల్ డ్రింక్ యాడ్ వస్తోంది. ఒకరు థండర్ అంటే.. ఇంకొకరు వండర్ అంటరు. రిఫ్రెష్ అని ఒకరు చెప్తే.. చిల్ అవ్వు అని మరొకరు చెప్తరు. ఫిల్ ఫిజ్.. బీ బోల్డ్.. అని ఒకాయన సెలవిస్తే.. సూపర్ డూపర్ రిఫ్రెషర్ అని ఇంకో మహానుభావుడు సెలవిస్తడు. సెలబ్రిటీలు సెలవిచ్చారని మనం గుడ్డిగా ఫాలో అయిపోతాం. ఇలా పోలోమని ఫాలో అయిపోయి.. సిప్పులకు సిప్పులు లేపేస్తే నిజంగానే మనల్ని లేపాల్సి వస్తది. అవును.. మీరు అనుకున్నదే నిజం. మరీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇందులో అంటే అవునంటున్నాయి తాజా అధ్యయనాలు.

ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి ఇటీవలే ఓ ఫేమస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వివరించింది. వీటిని జనం తాగేందుకు అసలు కారణం హీరోలేనని వెల్లడించింది. మన హీరో ఈ కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మనం అదే తాగాలని అనుకోవడం.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు, సర్కిల్‌లో మౌత్ టాక్‌తోనే అమ్మకాలు పెంచేస్తున్నాం.

వాళ్లు తాగరు.. జస్ట్ యాక్ట్ చేస్తారు..

ఓ ఉదాహరణ తీసుకుందాం.. ఓ హీరోయిన్ మ్యాంగో‌ ఫ్లేవర్డ్ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. కానీ ఓ కామెడీ షోకు వచ్చినప్పుడు దాన్ని తాగేందుకు నో చెప్పింది. అలాంటి ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ తీసుకోనని.. దాని వల్ల వచ్చే ఇబ్బందులు పడలేని నిర్మొహమాటంగానే చెప్పేసింది. ఓన్లీ నేచురల్ స్వీట్స్ లైక్ ఫ్రూట్స్ తీసుకుంటానని తెలిపింది.

హెల్త్ రిస్క్

  • కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే హై షుగర్ కంటెంట్ హెల్త్ ఇష్యూస్‌కు మెయిన్ రీజన్‌గా మారింది. ఇలాంటి ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ డ్రింక్స్ తరుచుగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
  • జీరో కేలరీలు ఉండటం వల్ల బరువు పెరిగేందుకు, ఊబకాయం వచ్చేందుకు కారణమవుతుంది. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెంచుతుంది.
  • షుగర్, కెఫైన్ స్థాయిలు అధికంగా ఉండటం బ్లడ్ ప్రెజర్‌ను పెంచి కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ (హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్) కు దారితీస్తుంది.
  • కార్బోనేషన్ ప్రాసెస్ కార్బోనిక్ యాసిడ్‌ను క్రియేట్ చేస్తుంది. దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. దంత క్షయం ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఈ పానీయాలు ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటిలోని ఫాస్పోరిక్ ఆమ్లం కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. బోలు ఎముకల వ్యాధికి దోహదం చేస్తుంది.

ప్రమాదంలో యూత్

దాహం వేస్తే నీరు తాగాలి. కానీ యూత్ స్టైల్‌గా తమ అభిమాన సెలబ్రిటీ మాదిరిగా కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తుంది. దీనివల్ల 20-30 ఏళ్ల మధ్యలో స్ట్రాంగ్‌గా ఉండాల్సిన ఎముకలు పెలుసుగా మారి విరిగిపోయేందుకు సిద్ధంగా ఉంటున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఇదంతా కేవలం స్టార్స్ ఎండోర్సింగ్ వల్లనే జరుగుతుందని నొక్కి చెప్పింది. అలాంటప్పుడు 30 ఏళ్లకు షుగర్, బీపీలు, గుండెపోట్లు రాకుండా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఇప్పటికైనా స్టార్స్ బాధ్యతాయుతంగా మెలిగితే బాగుంటుందని కోరుతున్నారు.

 

 

Similar News