Medical Science: యాంటీబయాటిక్స్ పనిచేయక ఏటా 10 లక్షల మంది మృత్యువాత.. తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు!
అపరిమితంగా(Limitless) యాంటీ బయాటిక్స్(Antibiotics) మందుల వాడకం వల్ల.. ఆ మందులను తట్టుకునే శక్తిని రోగకారక బ్యాక్టీరియా(Bacteria) పొందుతోంది.
దిశ, వెబ్ డెస్క్: అపరిమితంగా(Limitless) యాంటీ బయాటిక్స్(Antibiotics) మందుల వాడకం వల్ల.. ఆ మందులను తట్టుకునే శక్తిని రోగకారక బ్యాక్టీరియా(Bacteria) పొందుతోంది. అందువలన యాంటీబయాటిక్స్ పనిచేయక 1990 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే, రాబోయే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్ కు లొంగని రోగాల(diseases) వలన దాదాపు 3.9 కోట్ల మంది వరకూ మరణించే ప్రమాదం ఉందని జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్(Journal of Medical Science) పత్రిక అయిన లాన్సెట్ లో ప్రచురితమైన స్టడీ రిపోర్ట్(Study Report) వెల్లడించింది.
అయితే.. ఈ మరణాలలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలోనే అత్యధిక మరణాలు సంభవించనున్నట్లు నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది 2025 నుంచి 2050 ల మధ్య కాలంలో ఈ 3 దేశాల్లోనే యాంటీ బయాటిక్స్ కు లొంగని వ్యాధుల వల్ల 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 1990 నుంచి 2021 మధ్య కాలంలో యాంటీ బయాటిక్స్(Antibiotics) కు లొంగని రోగాల(diseases) వల్ల, 70 ఏళ్లు పై బడిన వారిలో మరణాలు 80 శాతానికి పైగా పెరిగాయి. రాబోయేకాలంలో ఈ మరణాలు వయో వృద్ధులలో మరింత పెరగనున్నాయి. ఈ యాంటీ బయాటిక్స్ నిరోధకత వల్ల.. ప్రపంచంలో వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ మరణాలు కూడా వృద్ధి చెందుతాయి కనుక, త్వరగా మేలుకొని నియంత్రణ చర్యలు చేపట్టకపోతే మరణరేటు(Mortality) పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. కాగా శాస్త్రజ్ఞులు 204 దేశాల్లో అన్ని వయసుల వారికి చెందిన 52 కోట్ల మందికి పైగా వైద్య సమాచారాన్ని(Medical Data) సేకరించి విశ్లేషించినట్లు(Analyzed) వారు తెలిపారు.