ఉదయం తొందరగా నిద్ర లేస్తున్నారా.. ఈ వ్యాధి బారిన పడొచ్చు..

చాలామందికి తెల్లవారు జామునే నిద్రలేచే అలవాటు ఉంటుంది.

Update: 2024-05-09 08:59 GMT

దిశ, ఫీచర్స్ : చాలామందికి తెల్లవారు జామునే నిద్రలేచే అలవాటు ఉంటుంది. కొంతమంది 3 గంటలకు నిద్ర లేస్తారు, మరి కొంతమంది 4, 5 గంటలకు నిద్రలేసి వారి పనులను చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా లేట్ దా నిద్రపోయే వారికి అస్సలు నిద్ర సరిపోదు. అయితే ఇలా తొందరగా నిద్రలేచే వారి పై కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ( తెల్లవారు జామునే ) నిద్రలేచే వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కళాశాలలోని ఓ పరిశోధనా బృందం చాలామంది పై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో నిద్రా విధానాలు, జన్యుసమాచారాన్ని పూర్తిగా విశ్లేషించారు. అప్పుడే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పొద్దున్నే నిద్రలేచే వారిలో ఎక్కువగా మతిమరుపు సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే కొన్ని పరిశోధనల్లో నిద్ర లక్షణాల ప్రభావం అల్జీమర్స్ ప్రమాదం పై కనిపించలేదని అన్నారు. ఈ వ్యాధిని సరైన నిద్ర ఆపగలదని చెబుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ లో సుమారుగా 5 లక్షల మంది అల్జీమర్స్ తో బాధపడుతున్నారని తెలిపారు.

Tags:    

Similar News