నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టేనట?
చాలా మంది శ్వాస తీసుకోవడానికి వారికి తెలియకుండానే నోరు తెరిచి నిద్రపోతుంటారు..
దిశ, వెబ్ డెస్క్: చాలా మంది శ్వాస తీసుకోవడానికి వారికి తెలియకుండానే నోరు తెరిచి నిద్రపోతుంటారు. అయితే అలా నిద్రపోవడానికి ఒక కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. నోరు తెరిచి నిద్రపోతే స్లీప్ ఆప్నియా అనే సమస్య ఉన్నట్టేనట. ఈ సమస్య ఉన్నవారికి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల నోరు ద్వారా శ్వాస తీసుకోవడం చేస్తారు. ఈ సమస్యతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా నోరు తెరిచి నిద్రపోతారట.
కొంత మందికి తీవ్రమైన జలుబు, దగ్గు, సైనస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించనప్పుడు వారు నోరు తెరిచి నిద్ర పోతారు. అలాగే ఊపిరితిత్తుల్లో ఉబ్బసంతో బాధపడేవారు కూడా నోటితో శ్వాస తీసుకుంటారు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రోజంతా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారట. అయితే నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధిత అలెర్జీలు వస్తాయట. కాబట్టి నోటి ద్వారా శ్వాస తీసుకునే వారు డాక్టర్లను సంప్రదించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.