ఇంటింటికీ వ్యాక్సిన్.. వంద శాతమే మా లక్ష్యం..
దిశ, భద్రాచలం : ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోందన్న వార్తల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో సత్యనారాయణపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, చర్ల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్‌ల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కోసం మెడికల్ సిబ్బంది రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య కార్యకర్తలు సర్వేచేసి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా సిద్ధం చేశారు. ఆ క్రమంలో మెడికల్ టీమ్ గ్రామాల […]
దిశ, భద్రాచలం : ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోందన్న వార్తల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో సత్యనారాయణపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, చర్ల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్‌ల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కోసం మెడికల్ సిబ్బంది రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య కార్యకర్తలు సర్వేచేసి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా సిద్ధం చేశారు. ఆ క్రమంలో మెడికల్ టీమ్ గ్రామాల సందర్శనలో భాగంగా ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ వేస్తున్నారు.
అంతేకాదు ఏకంగా వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడే వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు ఉన్నవారికి వైద్యాధికారులు, సిబ్బంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు.