జర్నలిస్టులందరికీ టెస్టులు చేయాలని మంత్రి ఆదేశం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టుందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన జెనరిక్ మెడికల్ దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ముగ్గురు జర్నలిస్టులు క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. జర్నలిస్టుందరు టెస్టులు చేసుకోవాలనీ, అందుకు సంబంధించి ఎవరెవరు లిస్ట్ అవుట్ చేయాలని డీపీఆర్‌వోను ఆదేశించారు. వారందరికీ టెస్టులు చేపించండని డీపీఆర్‌వోకు చెప్పారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ […]
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టుందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన జెనరిక్ మెడికల్ దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ముగ్గురు జర్నలిస్టులు క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. జర్నలిస్టుందరు టెస్టులు చేసుకోవాలనీ, అందుకు సంబంధించి ఎవరెవరు లిస్ట్ అవుట్ చేయాలని డీపీఆర్‌వోను ఆదేశించారు. వారందరికీ టెస్టులు చేపించండని డీపీఆర్‌వోకు చెప్పారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి ప్రభుత్వం రాత్రనక పగలనక కృషి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వైద్య పరీక్షలకు రెడీగా ఉన్నామని జర్నలిస్టులు తెలిపారు.
Tags: covid 19, coronavirus, tests, all journalists, palamuru dist, minister srinivas goud