పదే పదే దాహం వేస్తోందా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే ?

దిశ, వెబ్‌డెస్క్ : నీరు ఆరోగ్యానికి మంచిది. కనీసం ఒక రోజులో 5 లీటర్ల నీరైనా తాగలి అంటారు వైద్యులు. అయితే కొంత మంది ఎన్నిసార్లు వాటర్ తాగిన మళ్లీ దాహం వేస్తుటుంది. దాహం వేయడం మంచిదే కానీ ఎక్కువగా, పదే పదే దాహం వేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. దాహం ఎక్కువగా వేస్తోంది అంటే శరీరంలో కొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించాలంటున్నారు. లేదంటే ఇది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తోందని హెచ్చరిస్తున్నారు. […]

Update: 2021-12-11 22:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నీరు ఆరోగ్యానికి మంచిది. కనీసం ఒక రోజులో 5 లీటర్ల నీరైనా తాగలి అంటారు వైద్యులు. అయితే కొంత మంది ఎన్నిసార్లు వాటర్ తాగిన మళ్లీ దాహం వేస్తుటుంది. దాహం వేయడం మంచిదే కానీ ఎక్కువగా, పదే పదే దాహం వేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. దాహం ఎక్కువగా వేస్తోంది అంటే శరీరంలో కొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించాలంటున్నారు. లేదంటే ఇది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తోందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనిని ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. ఇలా అధిక దాహంతో తరచూ నీళ్లు తాగే వారిలో కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి.

అధిక దాహం ఉన్నవారిలో ఉండే వ్యాధులు..

శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, మీరు మళ్లీ మళ్లీ దాహం వేయవచ్చు. అంటే రక్తంలో ఆర్‌బీసీ ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.

ఎనీమియా రక్త హీనత ఉన్న వారిలో కూడా అధికంగా దాహం వేస్తూ ఉంటుంది. శరీరానికి కావలసినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడం వలన రక్త హీనత ఏర్పడుతుంది. దీనివలన అధికంగా దాహం వేయడం, అలసిపోవడం, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

పదే పదే నీళ్లు తాగుతున్నారంటే ఘగర్ సమస్య కూడా ఉండే ప్రమాదం ఉంది. ఘగర్ సమస్య ఉన్నవారు కూడా ప్రతీసారి నీళ్లు తాగుతూనే ఉంటారు. అంతే కాకుండా ఎక్కువగా దాహం వేయడం అనేది ఘగర్‌లో ప్రారంభంలో ప్రాథమిక లక్షణం. అదువలన దాహం అతిగా వేసే వారిలో ఘగర్ సమస్య కూడా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

హైపర్‌కాల్సెమియా అంటే రక్తంలో కాల్షియం అవసరానికి మించి ఉంటే. హైపర్‌కాల్సెమియా కారణంగా అధిక దాహం సమస్య ఉత్పన్నమౌతుంది.

Tags:    

Similar News