రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నహెల్త్ ఆఫీసర్.. మళ్లీ పాజిటివ్
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ హెల్త్ ఆఫీసర్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత మహమ్మారి బారినపడ్డారు. గాంధీనగర్‌లోని దేహ్‌గామ్‌కు చెందిన హెల్త్ ఆఫీసర్ జనవరి 16న టీకా తొలి డోసు తీసుకున్నారు. ఫిబ్రవరి 15న రెండో డోసు వేసుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. లక్షణాలను గుర్తించి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని ఫిబ్రవరి 20న తేలినట్టు చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి తెలిపారు. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు వివరించారు. […]
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ హెల్త్ ఆఫీసర్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత మహమ్మారి బారినపడ్డారు. గాంధీనగర్‌లోని దేహ్‌గామ్‌కు చెందిన హెల్త్ ఆఫీసర్ జనవరి 16న టీకా తొలి డోసు తీసుకున్నారు. ఫిబ్రవరి 15న రెండో డోసు వేసుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. లక్షణాలను గుర్తించి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని ఫిబ్రవరి 20న తేలినట్టు చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి తెలిపారు.
ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు వివరించారు. అయితే రెండో డోసు తీసుకోగానే కరోనాను నియంత్రించే యాంటీబాడీలు అభివృద్ధి చెందవని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత దాదాపు 45 రోజులకు మహమ్మారిని ఎదుర్కొనే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కాబట్టి రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.