ఢిల్లీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా టెస్ట్.. రిపోర్టుల్లో ఏమొచ్చిందంటే..

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. తీవ్ర జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ వేగంగా పడిపోవడంతో మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్చారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. కానీ, ఆ టెస్టుల్లో మంత్రికి కరోనా లేనట్టు నిర్ధారణ అయింది. రేయింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతూ తన ఆరోగ్యాన్నే ఖాతరు చేయలేదని, ఇప్పుడైనా శ్రద్ధ వహించాలని, ప్రజాసేవ చేసేందుకు తొందరగా కోలుకునిఆస్పత్రి నుంచి […]

Update: 2020-06-16 03:44 GMT

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. తీవ్ర జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ వేగంగా పడిపోవడంతో మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్చారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. కానీ, ఆ టెస్టుల్లో మంత్రికి కరోనా లేనట్టు నిర్ధారణ అయింది.

రేయింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతూ తన ఆరోగ్యాన్నే ఖాతరు చేయలేదని, ఇప్పుడైనా శ్రద్ధ వహించాలని, ప్రజాసేవ చేసేందుకు తొందరగా కోలుకునిఆస్పత్రి నుంచి బయటకురావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. టేక్ కేర్ అంటూ సూచించారు.

Tags:    

Similar News