1000 వెంటి లేటర్లను త్వరగా పంపించండి : మంత్రి ఈటల

దిశ, కరీంనగర్: తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం తరఫున చేసిన ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ ద్వారా సంభాషించారు.రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రానికి 1000 వెంటి లేటర్స్‌ను వెంటనే పంపించాలని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన ప్రారంభించినందున వాటి అవసరం ఎంతైనా ఉందని వివరించారు. అలాగే […]

Update: 2020-04-20 06:52 GMT

దిశ, కరీంనగర్: తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం తరఫున చేసిన ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ ద్వారా సంభాషించారు.రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రానికి 1000 వెంటి లేటర్స్‌ను వెంటనే పంపించాలని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన ప్రారంభించినందున వాటి అవసరం ఎంతైనా ఉందని వివరించారు. అలాగే పీపీఈ కిట్స్, ఎన్ -95 మాస్క్‌లను హెచ్ సీఎల్ నుంచి అందిస్తామని కేంద్రం చెప్పిందని కానీ, అవసరమున్నమేరకు అందించలేదన్నారు. పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్క్‌లు తాము సేకరిస్తున్నప్పటికీ వాటికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నదని కావున, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాష్ట్రానికి అందజేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఈటల కేంద్ర వైద్య సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేను కోరారు.

tags: lockdown, corona, minister etela rajender, appeal to central minister ashwini kumar

Tags:    

Similar News