ఆ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో దేశీయంగా బ్యాంకులు గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), కోటక్ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా చేరింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతానికి మార్చినట్టు బుధవారం తెలిపింది. తాజా వడ్డీ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో దేశీయంగా బ్యాంకులు గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), కోటక్ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా చేరింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతానికి మార్చినట్టు బుధవారం తెలిపింది. తాజా వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ‘హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నాం. ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న వేళ హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ గృహ రుణాలను తీసుకునే వినియోగదారులందరూ తాజా తగ్గింపుతో లబ్ది పొందుతారని’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించగా, కోటక్ బ్యాంక్ 6.65 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ ఈ ఆఫర్‌తో పాటు జీరో ప్రాసెసింగ్ ఫీజును సైతం అందిస్తున్నట్టు తెలిపింది. సిబిల్ స్కోర్‌పై ఆధారపడి పలు రాయితీలు, ఈ వారంలో రానున్న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును ఎస్‌బీఐ ప్రకటించింది.