ప్రైవేటు సెక్టార్‌లో స్థానికులకు 75% రిజర్వేషన్లు
దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీ గురువారం కీలక బిల్లును ఆమోదించింది. తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పాస్ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు, ఇతర కంపెనీలూ ఉద్యోగ నియామకాల్లో 75శాతం స్థానికులకు రిజర్వేషన్‌ను పాటించాలని ఈ బిల్లు పేర్కొంది. ఒకవేళ ఆయా సంస్థలకు కావాల్సిన నైపుణ్యమున్న వారు లేకుంటే అందుకు స్థానికుల శిక్షణనిచ్చే ఏర్పాటునూ ఈ బిల్లు ప్రతిపాదించింది. చట్టంగా మారడానికి రాష్ట్ర గవర్నర్ బిల్లుకు ఆమోదం […]
దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీ గురువారం కీలక బిల్లును ఆమోదించింది. తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పాస్ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు, ఇతర కంపెనీలూ ఉద్యోగ నియామకాల్లో 75శాతం స్థానికులకు రిజర్వేషన్‌ను పాటించాలని ఈ బిల్లు పేర్కొంది. ఒకవేళ ఆయా సంస్థలకు కావాల్సిన నైపుణ్యమున్న వారు లేకుంటే అందుకు స్థానికుల శిక్షణనిచ్చే ఏర్పాటునూ ఈ బిల్లు ప్రతిపాదించింది. చట్టంగా మారడానికి రాష్ట్ర గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఇదే హామీనివ్వడం గమనార్హం. ఈ బిల్లును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.