ట్రంప్ సర్కారుపై ‘హార్వర్డ్’ దావా
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు అందించే యూనివర్సిటీల విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లాలని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై విశ్వవిద్యాలయాలు ఆగ్రహిస్తున్నాయి. ముందస్తుగా తమకు తెలియజేయలేదని, ఆ ఆదేశాలు చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లు ట్రంప్ సర్కారుపై న్యాయస్థానంలో బుధవారం దావా వేశాయి. ట్రంప్ ప్రభుత్వ ప్రకటన చట్టవిరుద్ధమని, ఆ ఆదేశాలపై టెంపరరీ రిస్ట్రేనింగ్ ఆర్డర్ వేయాలని కోర్టును అభ్యర్థించాయి. ఈ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ […]
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు అందించే యూనివర్సిటీల విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లాలని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై విశ్వవిద్యాలయాలు ఆగ్రహిస్తున్నాయి. ముందస్తుగా తమకు తెలియజేయలేదని, ఆ ఆదేశాలు చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లు ట్రంప్ సర్కారుపై న్యాయస్థానంలో బుధవారం దావా వేశాయి. ట్రంప్ ప్రభుత్వ ప్రకటన చట్టవిరుద్ధమని, ఆ ఆదేశాలపై టెంపరరీ రిస్ట్రేనింగ్ ఆర్డర్ వేయాలని కోర్టును అభ్యర్థించాయి. ఈ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలసీపై 14 రోజుల స్టే అమలు చేయవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు లారెన్స్ బెకో ఓ మీడియాతో మాట్లాడుతూ, సర్కారు ఆదేశాలు ప్రజావ్యతిరేకమైనవని, చట్టవిరుద్ధమని, ఈ కేసు విచారణలో గెలవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తామని తెలిపారు.