కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించారు. ప్రాంతీయ కూటమి ముందస్తు ఒప్పందం ప్రకారం ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నటకని నుంచి హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ‘ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న తరుణంలో నేను బాధ్యతలు స్వీకరిస్తున్నానని నాకు తెలుసు. వచ్చే రెండు దశాబ్దాల్లో మనం ఆరోగ్యపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఇవన్నీ మన పరస్పర భాగస్వామ్యాన్ని […]
న్యూఢిల్లీ: డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించారు. ప్రాంతీయ కూటమి ముందస్తు ఒప్పందం ప్రకారం ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నటకని నుంచి హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ‘ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న తరుణంలో నేను బాధ్యతలు స్వీకరిస్తున్నానని నాకు తెలుసు. వచ్చే రెండు దశాబ్దాల్లో మనం ఆరోగ్యపరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఇవన్నీ మన పరస్పర భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.