‘దళిత బంధు భయంతో ఒక్కటైన బీజేపీ-కాంగ్రెస్’
దిశ, సిద్దిపేట: హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన […]
దిశ, సిద్దిపేట: హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. దళిత అభ్యర్థులను బరిలోకి దింపితే ఓట్లు చీల్చవచ్చనే దిగజారుడు రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ సైతం ఇతర దళిత నేతలను హుజురాబాద్‌లో పోటీ చేయించాలని చూస్తున్నదని, దీనివల్ల తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనుకూలత ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నదని విమర్శించారు. దళితబంధు పథకంతో దళితులంతా టీఆర్‌ఎస్ వైపే నిలవడం ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్రలు, కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.