నేను అనర్హుడను కాదు.. ఆడటానికి రెడీ : హర్భజన్
దిశ, స్పోర్ట్స్: ‘నేను ఇప్పటికీ టీ20 ఆడటానికి పూర్తి ఫిట్‌గా ఉన్నాను. నన్ను సెలెక్ట్ చేయాల్సింది మీరే’ అని సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్.. ఇప్పటికే ఈ టోర్నీలో 150 వికెట్ల మైలు రాయిని దాటాడు. తాను అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఏ విధంగా అనర్హుడనో చెప్పాలని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నాడు. ఇటీవల ఓ క్రీడా వెబ్‌సైట్‌కు హర్భజన్ ఇంటర్వూ […]
దిశ, స్పోర్ట్స్: ‘నేను ఇప్పటికీ టీ20 ఆడటానికి పూర్తి ఫిట్‌గా ఉన్నాను. నన్ను సెలెక్ట్ చేయాల్సింది మీరే’ అని సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో మూడో స్థానంలో ఉన్న హర్భజన్.. ఇప్పటికే ఈ టోర్నీలో 150 వికెట్ల మైలు రాయిని దాటాడు. తాను అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఏ విధంగా అనర్హుడనో చెప్పాలని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నాడు. ఇటీవల ఓ క్రీడా వెబ్‌సైట్‌కు హర్భజన్ ఇంటర్వూ ఇచ్చాడు. ఇందులో పలు విషయాలు పంచుకున్నాడు. ‘ఐపీఎల్ వంటి టోర్నీలోనే నేను అద్భుతంగా బౌలింగ్ చేయగలిగినప్పుడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఎందుకు రాణించలేను. ఐపీఎల్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. అంతే కాకుండా అక్కడ బౌండరీ లైన్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో కూడా నేను చాలా వికెట్లు తీశాను. మరి ఇంత కంటే సులభంగా ఉండే అంతర్జాతీయ మ్యాచ్‌లలో నేను బౌలింగ్ చేయలేనా. ఈ విషయాన్ని సెలెక్టర్లు గుర్తించాలి.’ అని హర్భజన్ చెప్పాడు. ఇప్పటికైనా సీనియర్లను పక్కన పెట్టకుండా.. వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని.. అవసరమైతే టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయాలని సూచించాడు.